
హైదరాబాద్, వెలుగు: టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియతో ఖాళీ అయిన ఎస్జీటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ యూనియన్ (టీపీటీయూ) డిమాండ్ చేసింది. టీపీటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మట్టపల్లి రాధాకృష్ణారావు, పి.చంద్రశేఖర్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ కె.సారయ్య శుక్రవారం హైదరాబాద్లోని స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ లింగయ్యను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
వర్క్ అడ్జస్ట్ మెంట్ తో లేదా విద్యా వాలంటీర్ల ద్వారా ఆ పోస్టులను నింపాలని కోరారు. దీంతోపాటు జీహెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లలో నాన్ జాయినింగ్, నాట్ విల్లింగ్ పోస్టులను సీనియారిటీ ప్రాతిపదికన టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. స్కూళ్లలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.