
హైదరాబాద్, వెలుగు : ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయ తీలలో జాతీయ జెండాను ఎగురవేయ నున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబా ద్ పబ్లిక్ గార్డెన్‌లో జరిగే అధికారిక కార్య క్రమంలో జాతీయ పతాకాన్ని ఎగురవే స్తారు.
మంత్రులు, ఇతర ప్రముఖులు జిల్లా కేంద్రంలో పాల్గొంటారు. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబర్ 17వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరై జెండా ఆవిష్కరించనున్నట్లు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించింది. పబ్లిక్ గార్డెన్‌లో ఏర్పాట్లను డీజీపీ జితేందర్, ఇతర అధికారులు పరిశీలించారు.