V6 News

‘ఓట్ చోర్, గద్దీ చోడ్’పై పది లక్షల సంతకాలు సేకరణ

‘ఓట్ చోర్, గద్దీ చోడ్’పై  పది లక్షల సంతకాలు సేకరణ
  • గాంధీ భవన్ నుంచి ట్రక్కులో 
  • ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసుకు తరలింపు

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ పిలుపు మేరకు ‘ఓట్ చోర్, గద్దీ చోడ్’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ ఆధ్వర్యంలో పది లక్షల సంతకాలను సేకరించారు. వీటన్నింటిని గురువారం గాంధీ భవన్ నుంచి జెండా ఊపి ప్రత్యేక ట్రక్కులో ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసుకు పంపించారు. ఈ నెల 14న ఢిల్లీలోని రామ్​లీల మైదానం నుంచి ర్యాలీగా తీసుకెళ్లి రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ముకు వీటిని అందజేయనున్నారు.

 తెలంగాణ వ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని  గత కొన్ని రోజులుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో పలు సమావేశాలు నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ తో పాటు దాని అనుంబంధ సంఘాల నాయకులు పాల్గొని ప్రతి గ్రామం నుంచి సంతకాలు సేకరించారు.