కరీంనగర్ సిటీ, వెలుగు: అద్దె చెల్లించకపోవడంతో కరీంనగర్అర్బన్లో అంగన్వాడీ సెంటర్కు ఇంటి యజమాని తాళం వేశారు. కరీంనగర్దుర్గమ్మగడ్డలో అంగన్వాడీ సెంటర్నడుస్తోంది. ఈ సెంటర్ కొంతకాలం క్రితం పక్కనే మరోచోట నడుస్తుండేది. అక్కడ అద్దె సరిగ్గా చెల్లించడం లేదని ఖాళీ చేయించారు. అక్కడ రూ. 20 వేల బకాయి ఉండడంతో చెల్లించారు. ప్రస్తుతం ఇక్కడ డిసెంబర్నుంచి రూ. 40 వేల వరకు బకాయి పడ్డారు. దీంతో ఇంటి యజమాని అద్దె చెల్లించాలని శుక్రవారం సెంటర్కు తాళం వేశారు. అంగన్వాడీ యూనియన్ సభ్యులు వచ్చి ఇంటి యజమానితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. దీంతో పై అధికారులకు సమాచారం అందించి సాయంత్రం 4 గంటల వరకు సెంటర్ వద్దనే పడిగాపులు పడ్డారు. ఇంత జరుగుతున్నా సెంటర్వద్దకు ఒక్క అధికారి కూడా రాలేదు. కరీంనగర్ అర్బన్పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం 18 నెలలుగా అద్దె బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఇంటి యజమానులు అద్దె చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. తప్పనిసరి పరిస్థితిలో కొంతమంది టీచర్లు అప్పులు చేసి సెంటర్రెంట్ చెల్లిస్తున్నారు.
