గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం తిరిగి దాదాపుగా మెుదటికి వచ్చిన వేళ బంగారం, వెండి రేట్లు పతనం అవుతున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి అనూహ్యాంగా పసిడి ధరల పతనం పెట్టుబడిదారులకు నిద్రలేకుండా చేస్తున్నప్పటికీ.. భారతీయ రిటైల్ కొనుగోలుదారులకు మాత్రం పెద్ద ఊరటగా నిలుస్తోంది. ఇరాన్ దూకుడుగా దాడులకు దిగుతుండటంతో గ్లోబల్ బులియన్ మార్కెట్లలో కూడా ఆందోళనలు మెుదలయ్యాయి. అయితే మూడు నెలలు దాటినా వివాదం కొలిక్కిరాకపోవటంతో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అయితే తగ్గిన రేట్లలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు ప్రజలు తమ నగరాల్లో తాజా రేట్లను పరిశీలించటం బెటర్.
జూన్ 11న బంగారం రేట్లు భారీగా తగ్గాయి. జూన్ 10 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.213 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 564గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 350గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 11, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 60వేలకు చేరింది. అంటే గ్రాము దాదాపు రూ.260 దగ్గర ఉంది.
