కూరలో నూనె ఎక్కువైందా? పెరుగు పుల్లగా అయ్యిందా? ఈ సింపుల్ ట్రిక్స్ తెలిస్తే మీరే కిచెన్ క్వీన్!

 కూరలో నూనె ఎక్కువైందా? పెరుగు పుల్లగా అయ్యిందా? ఈ సింపుల్ ట్రిక్స్  తెలిస్తే మీరే కిచెన్ క్వీన్!

వంట చేయడం ఒక ఎత్తైతే.. వంట గదిలో వచ్చే చిన్న చిన్న సమస్యలను మేనేజ్ చేయడం మరో ఎత్తు. కూరలో నూనె ఎక్కువైనా, పెరుగు పుల్లగైనా కంగారు పడాల్సిన పనిలేదు. మీ వంటని మరింత ఈజీగా, పర్ఫెక్ట్‌గా మార్చే కొన్ని అద్భుతమైన వంటింటి చిట్కాలు ఇవే...
 
*కూరల్లో నూనె ఎక్కువైనప్పుడు... గరిటెతో తీస్తే నూనెతో పాటు గ్రేవీ కూడా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే కడాయిని వంకరగా పెడితే నూనె పైకి తేలుతుంది. అందులో బ్రెడ్ స్లైసు ముంచితే నూనెని బ్రెడ్ పీల్చుకుంటుంది.

 *తరిగిన వెంటనే ఉప్పు నీళ్లలో వేసినప్పటికీ.. వంకాయలు రంగు మారతాయి. అలాంటప్పుడు ఉప్పు నీళ్లలో కొన్ని కాచిన పాలు కలిపి వంకాయ ముక్కలు వేయాలి. 

*కోడి గుడ్లు పొట్టుతో సహా మైక్రోవేవ్‌లో రీహీట్ చేయకూడదు. అలా చేస్తే రేడియేషన్ వల్ల ఎగ్ పగిలిపోయి మైక్రోవేవ్ అంతా చిల్లుతుంది. అలాగే ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన కోడిగుడ్లను ఉడక పెట్టేటప్పుడు.. వాటిని రూమ్ టెంపరేచర్‌లో ఉంచి, ఆ తర్వాత ఉడకబెట్టాలి. లేదంటే గుడ్డు పగిలిపోతుంది. 

*టొమాటోలని మూడునాలుగు నిమిషాలు గోరు వెచ్చని నీళ్లలో ఉంచితే తొక్క తేలిగ్గా వస్తుంది.

*పెరుగు పులుపు ఎక్కితే.. అందులో కొన్ని నీళ్లు కలపాలి. గంట తర్వాత ఆ నీళ్లని వంపేస్తే పులుపు తగ్గుతుంది.

*వంట చేసేటప్పుడు అడుగు సమంగా ఉన్న పాన్ వాడితే హీట్ కూడా సమంగా అందుతుంది. ఉడకపెట్టిన ఆలుగడ్డల్ని తరిగేటప్పుడు.. కత్తి జిగురుగా అవుతుంది. అలా కాకూడదంటే కత్తిని కాసేపు నీళ్లలో ఉంచాలి.