10 రోజుల్లో 10 వేల రూపాయలు తగ్గిన బంగారం : తులం లక్ష రూపాయలకు పడిపోతుందా..?

10 రోజుల్లో 10 వేల రూపాయలు తగ్గిన బంగారం : తులం లక్ష రూపాయలకు పడిపోతుందా..?

నిన్నా మొన్నటి వరకు బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. హద్దు లేకుండా పెరిగిపోయింది. ఇప్పుడు బంగారం ధరలు రివర్స్ అయ్యాయా.. రోజు రోజుకు పడిపోతున్న ధరలు దేనికి సంకేతం.. ఎందుకు బంగారం ధర పడిపోతుంది.. 10 రోజుల్లోనే.. 10 వేల రూపాయలు తగ్గటానికి కారణం ఏంటీ అనేది తెలుసుకుందాం..

10 రోజుల్లో 10 వేల రూపాయలు డౌన్..

2026, జూన్ 11వ తేదీన 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం లక్షా 49 వేల రూపాయలుగా ఉంది. అదే 22 క్యారెట్స్ బంగారం 10 గ్రాములు లక్షా 36 వేల రూపాయల వరకు ఉంది. 

2026 జూన్ ఒకటో తేదీన ఇదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం లక్షా 59 వేల రూపాయలుగా ఉంది. 
జూన్ 11వ తేదీ నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం లక్షా 49 వేల రూపాయలకు పడిపోయింది. 
అంటే 10 రోజుల్లో ఏకంగా 10 వేల రూపాయలు తగ్గింది. 

ALSO READ : ఆంత్రోపిక్‌తో చేతులు కలిపిన TCS..

ఇది ఆషామాషీగా తీసుకోవాల్సిన అంశమేనా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఇదే సమయంలో బంగారం మరింత తగ్గుతుందని.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం లక్ష రూపాయలకు దిగి వస్తుందని.. మరో 50 వేల రూపాయలు పతనం అవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. బంగారం ఇంతలా తగ్గటానికి.. లక్ష రూపాయలకు చేరటానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం..