బాదం పాలు (Badam Milk) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పౌష్టికాహారం. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.. గుండెకు ఆరోగ్యం..బరువును నియంత్రిస్తుంది.. విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు స మృద్దిగా ఉంటాయి. షుగర్ లేని బాదంపాలు బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. బయట దొరికే బాదం పాలలో అదనపు చక్కెరలు, స్టెబిలైజర్లు ,ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. కల్తీ కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో సొంతంగా తయారు చేసుకుంటే బాగుంటుందనుకుంటారు. అలాంటి వారికోసం ఇంట్లోనే బాదం పాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు
1 కప్పు పచ్చి బాదం పప్పులు
4 కప్పుల నీరు
1-2 ఖర్జూరాలు
1/2 టీస్పూన్ వెనిలా ఎక్స్ట్రా ట్రాక్ట్
చిటికెడు ఉప్పు
తయారీ విధానం.. దశల వారీగా..
బాదం పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.
నానబెట్టిన బాదంపప్పులను కడిగి, 4 కప్పుల నీటితో పాటు బ్లెండర్లో వేయాలి.
మృదువైన, క్రీములాంటి చిక్కదనం వచ్చేవరకు కలపాలి.
పాలను ఒక గుడ్డ ద్వారా వడకట్టాలి.
ఖర్జూరాలు, వెనిలా ఎక్స్ట్రాక్ట్ మరియు ఉప్పు వేసి కలపాలి. మళ్ళీ బ్లెండ్ చేయాలి.
ఇంట్లో తయారుచేసిన బాదం పాలను ఒక సీసాలో పోసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి..
3 నుంచి4 రోజుల్లోగా వాడితే ఆరోగ్యానికి ఆరోగ్యం.. బలానికి బలం.
►ALSO READ | కాఫీ, టీ, కూల్ డ్రింక్.. ఈ మూడింట్లో దేని వల్ల దంతాలకు ఎక్కువ నష్టమంటే..?
