కాంప్లెక్స్ ​ఎరువుల  ధర రూ.100 తగ్గింది

కాంప్లెక్స్ ​ఎరువుల  ధర రూ.100 తగ్గింది

కొత్తగా పొటాష్‌‌కు రాయితీ ప్రకటించిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు: కాంప్లెక్స్‌‌ ఎరువుల ధరలో బ్యాగుకు రూ.100 చొప్పున కేంద్రం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు మే 5న జారీ చేసిన నోటిఫికేషన్‌‌ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నత్రజని, భాస్వరం, పొటాష్‌‌(ఎన్‌‌పీకే ) గ్రేడ్ 3 రకాల ఎరువులు ధరలు తగ్గనున్నాయి. మొలాసిస్‌‌ నుంచి ఉత్పత్తయ్యే పొటాష్‌‌కు తొలిసారిగా రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. పొటాష్‌‌ను పోషకాధారిత రాయితీ పథకం కిందకు తీసుకొచ్చిన కేంద్రం ఖనిజ ఆధారిత పొటాష్‌‌ దిగుమతి తగ్గించాలని నిర్ణయించింది. దీనికి తోడు డీఏపీకి కంపెనీలకు ఇచ్చే రాయితీ మరో రూ. 438 పెంచింది. రైతులకు మాత్రం డీఏపీ ధరలు ఎప్పటిలాగే బ్యాగుకు రూ.1200 ఉండనుంది. 
కాంప్లెక్స్ ​ఎరువుల ధరలు (రూ.లలో)
ఎరువు రకం    ప్రస్తుత ధర    రాయితీ తర్వాత
ఎన్‌‌పీకే 20:20:0:13    1,400    1,300
ఎన్​పీకే 12:13:16    1,700    1,470
ఎన్‌‌పీకే 10:26:26    1,700    1,470