
యాదాద్రి భువనగిరి జిల్లా :- ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. 2024 మే ఆదివారం రోజున స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు ఎక్కవ సంఖ్యలో మొక్కులు తీర్చుకోవడానికి తరలివచ్చారు. తెల్లవారిజాము నుంచే భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇక్కట్లు కలగకుండా అన్ని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.