యాదాద్రిలో పులి కలకలం.. జనగామ జిల్లా వైపు పయనం

యాదాద్రిలో పులి కలకలం.. జనగామ జిల్లా వైపు పయనం

యాదాద్రి, వెలుగు:  యాదాద్రి జిల్లాలో మళ్లీ పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. సిద్దిపేట జిల్లాకు వెళ్లినట్టే వెళ్లిన పులి తిరిగి యాదాద్రి జిల్లాకు వచ్చేసింది. జిల్లాలోని రాజాపేట మండలం బసంతాపూర్​కు వచ్చిన పులి ఓ లేగ దూడను హతమార్చింది. అక్కడి నుంచి ఆలేరు మండలం శ్రీనివాసపురం వెళ్లినట్టుగా పాదముద్రల ఆధారంగా ఫారెస్ట్ ఆఫీసర్లు గుర్తించారు.

అక్కడి నుంచి జనగామ జిల్లా సిద్దెంకి, యాదాద్రి జిల్లా రాఘవపురం సరిహద్దులోని కొండపైకి పులి వెళ్లినట్టుగా అనుమానిస్తున్నారు. దీంతో కొండకు మూడు వైపులా మేకను ఎరగా పెట్టి బోన్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ట్రాప్​ కెమెరాలు ఏర్పాటుచేశారు. పరిస్థితిని యాదాద్రి కలెక్టర్​ హనుమంతరావు పర్యవేక్షిస్తున్నారు.