ఖైరతాబాద్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా గౌడన్నలు ఐక్యంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సంజీవయ్య పార్కులో గౌడ అఫీషియల్అండ్ ప్రొఫెషనల్స్అసోసియేషన్ఆధ్వర్యంలో ఆదివారం కార్తీకమాస వనభోజనాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఉండి గోపాను విస్తరించాలని, గౌడ సామాజికవర్గానికి చెందిన బిడ్డలంతా సభ్యులుగా చేరి ఇలాంటి వేదికల ద్వారా కలుస్తూ ఉండాలన్నారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, రాజేశం గౌడ్, మండలి మాజీ చైర్మన్స్వామి గౌడ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు.

