కరోనాతో మరో మావో అగ్రనేత వినోద్ మృతి

కరోనాతో మరో మావో అగ్రనేత వినోద్ మృతి

మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కరోనా కాటుకు మావోయిస్టు అగ్రనేత వినోద్‌ మృతి చెందారు. ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగడంతో వినోద్‌ చనిపోయాడు.30 ఏళ్ల కిందటే తెలంగాణ నుంచి చత్తీస్‌ గఢ్ కి వెళ్లిన మావోయిస్టుల్లో వినోద్‌ కూడా ఒకరు. చత్తీస్‌ గఢ్ లో జనతన సర్కార్‌ను విస్తరించడంతో పాటు.. మద్దతు సాధించడంలో ఆయన కీలక పాత్ర వహించారు. దక్షిణ ప్రాంతీయ మావోయిస్టుల కమిటీలోనూ వినోద్‌ కీలకంగా వ్యవహరించారు.

 చత్తీస్‌గఢ్, ఏవోబీ కేంద్రంగా జరిగిన పలు కీలక దాడుల్లో వినోద్‌ పాత్ర ఉంది. దీనికి సంబంధించి ఆయనపై చాలా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు వినోద్‌ను పట్టుకునేందుకు  NIA చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. NIAకి  మావోయిస్టు వినోద్‌ మోస్ట్‌ వాంటెండ్‌గా ఉన్నారు. ప్రస్తుతం అతనిపై 15లక్షల రివార్డ్ ఉంది. ఇందులో పది లక్షల రూపాయలు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించగా.. రూ. 5 లక్షలు NIA ప్రకటించింది. దర్భఘటి, జీరం అంబుష్‌, బీజేపీ ఎమ్మెల్యే బిమా మండవి మృతి ఘటనల్లో వినోద్‌ కీలక పాత్ర పోషించారు.

మావోయిస్టు నేతల్లో ఇద్దరు వినోద్ లుండటంతో .. చనిపోయింది...వరంగల్‌ కు చెందిన వినోదా.. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తినా అనేది స్పష్టత లేదంటున్నారు పోలీసులు.