
హైదరాబాద్, వెలుగు: విమానంలో ఫుడ్ సప్లయ్ చేసే ట్రేల మధ్యలో స్మగ్లింగ్ చేస్తున్న 2 కిలోల గోల్డ్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఎయిర్ క్యాటరింగ్ సర్వీసెస్ ఎంప్లాయ్‌ని అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సోదాలు జరిపిన అధికారులు క్యాటరింగ్ ఉద్యోగి నుంచి రూ.1.09 కోట్లు విలువ చేసే 2 కిలోల 200 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. విమానంలో క్యాటరింగ్ సర్వీస్ చేసే సిబ్బందితో స్మగ్లర్లు ఒప్పందం చేసుకొని గోల్డ్‌ను స్మగ్లింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఫుడ్ ట్రేలు లోడింగ్ అన్‌లోడింగ్ చేసే టైమ్‌లో గోల్డ్‌ను ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నట్లు గుర్తించారు.