కేంద్ర ప్రభుత్వ నిధులతో సికింద్రాబాద్ స్టేషన్​ను​ అభివృద్ధి చేస్తం

కేంద్ర ప్రభుత్వ నిధులతో  సికింద్రాబాద్ స్టేషన్​ను​ అభివృద్ధి చేస్తం

సికింద్రాబాద్​,వెలుగు: ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ.715 కోట్లతో సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ను  అభివృద్ధి చేస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్​ కిషన్​రెడ్డి తెలిపారు. బుధవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం ​అరుణ్​కుమార్​ జైన్​, ఇతర అధికారులతో కలిసి ప్లాట్​ఫామ్ ‌‌‌‌–1లో మల్టీ లెవెల్​పార్కింగ్​కు నిర్మిస్తున్న బిల్డింగ్​పనులు, ఇతర భవన నిర్మాణ పనులను కేంద్రమంత్రి పరిశీలించారు. రైల్వే స్టేషన్ ​ఆధునీకరణ పనులపై రైల్వే   అధికారులతో రివ్యూ  చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత రాష్ర్ట ప్రభుత్వం తమకు సహకరించకపోవడంతో రాష్ర్టంలో చేపట్టాల్సిన పలు రైల్వే అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో ఆలస్యమైందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి దీటుగా రైల్వే స్టేషన్​ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో 26 లిఫ్టులు,32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు  ఏర్పాటు చేస్తున్నారని, వీటితో పాటు స్టేషన్​కు రెండు వైపులా మెట్రో స్టేషన్లు, బస్సు స్టేషన్లకు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొంతం దీపిక, చీర సుచిత్ర,  బీజేపి నేతలు పాల్గొన్నారు.