
- కార్యకర్తల సమావేశంలో నేతలు
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం యూసఫ్‌గూడలోని ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీ రఘునందన్ రావు, జూబ్లీహిల్స్ ఇన్చార్జ్ లంకాల దీపక్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వారి పాలనపై ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. నాయకులు, కార్యకర్తలు ఏకతాటిపై నిలబడి పార్టీని బలోపేతం చేయాలని రామచందర్ రావు సూచించారు. జూబ్లీహిల్స్లో పార్టీ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కోరారు.