హుజూర్ నగర్,వెలుగు: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి క్లీన్ స్వీప్ చేస్తుందని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్ నగర్ లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం అభ్యర్థుల తరఫున మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. అర్బనైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీల్లో అధిక మొత్తంలో నిధులు వెచ్చించి ప్రజలకు మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చి,అభివృద్ధి సంక్షేమాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. వార్డుల్లో ప్రజలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వామపక్ష పార్టీల కౌన్సిలర్లకు అభివృద్ధి పథకాలలో తగిన భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
