జహంగీర్ పీర్ దర్గాకు మరిన్ని నిధులు ఇవ్వండి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

జహంగీర్ పీర్ దర్గాకు మరిన్ని నిధులు ఇవ్వండి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
  • మంత్రి అజారుద్దీన్​ను కోరిన ఎమ్మెల్యే

షాద్ నగర్, వెలుగు: కొత్తూరులోని జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి మరిన్ని అదనపు నిధులు మంజూరు చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్​ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. గురువారం హైదరాబాద్​లో మంత్రిని ఆయన కలిశారు.

ప్రస్తుతం రూ. 12 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో దర్గా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వీటికి అదనంగా మరో రూ. 8 కోట్లు కేటాయించాలని విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో దర్గాను సమగ్రంగా అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు.