- గోవుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి: యుగ తులసి ఫౌండేషన్
పంజాగుట్ట, వెలుగు: రాష్ట్రంలో గోవుల రక్షణ, గోశాలల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని యుగ తులసి ఫౌండేషన్ డిమాండ్ చేసింది. గో రక్షణ చట్టం అమలులో సర్కారు నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ నవంబర్ 17 నుంచి 48 గంటలపాటు హైదరాబాద్–విజయవాడ హైవే సమీపంలోని కొత్తగూడెం చౌరస్తా వద్ద వెయ్యి గోవులతో, వేలాది వాహనాలతో గో సడక్ బంద్ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించింది.
శుక్రవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ శివకుమార్, ప్రతినిధులు కృష్ణస్వామి, చంద్రస్వామి, సంగమేశ్వర్ చారి, మాలాద్రి, సంజయ్ గుప్త మాట్లాడారు. గోశాలల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆవుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని గోశాలలకు శాశ్వత ఆర్థిక భద్రత కల్పించేందుకు రూ.1,000 కోట్లతో ఫోడర్ ఫండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
