లక్షన్నర అంగన్‌వాడీల్లో పిల్లలకు మంచినీళ్లు లేవు

లక్షన్నర అంగన్‌వాడీల్లో పిల్లలకు  మంచినీళ్లు లేవు

దేశవ్యాప్తంగా లక్షన్నర పైగా అంగన్‌వాడీలకు తాగునీటి సదుపాయం లేదని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడి ప్రశ్నకు రాతపూర్వకంగా ఆమె బదులిచ్చారు. దేశమంతా కలిపి 13,77,595 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. వాటిలో 3,77,712 సెంటర్లను అద్దె బిల్డింగుల్లో నిర్వహిస్తున్నామన్నారు.

అయితే కనీసం మౌలిక సదుపాయలు లేని అంగన్‌వాడీ కేంద్రాలు భారీగానే ఉన్నాయని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన సమాధానంలో తెలిపారు. దేశ వ్యప్తంగా 3,62,940 సెంటర్లలో టాయిలెట్లు కూడా లేదని వివరించారు. అలాగే కనీసం తాగునీటి సౌకర్యం లేని అంగన్‌వాడీలో 1,59,568 ఉన్నాయని చెప్పారామె.