రియల్ ఎస్టేట్ సంపన్నుల్లో 10 మంది మనోళ్లు.. గ్రోహ్-హురున్ రిచ్ లిస్టులో వెల్లడి

రియల్ ఎస్టేట్ సంపన్నుల్లో 10 మంది మనోళ్లు.. గ్రోహ్-హురున్ రిచ్ లిస్టులో వెల్లడి

రియల్ ​ఎస్టేట్ సంపన్నుల జాబితాలో రాష్ట్రానికి చెందిన 10 మందికి చోటు దక్కింది. గ్రోహ్- హురున్​ రియల్ ​ఎస్టేట్​ రిచ్​లిస్ట్-2023లో ‘గార్​కార్పొరేషన్’​ కంపెనీ ఓనర్ జి.అమరేందర్ రెడ్డి రూ.15 వేల కోట్ల సంపదతో దేశంలోనే 10వ స్థానంలో నిలిచారు. ఈయన ఫ్యామిలీలోని అభినవ్​రామ్​రెడ్డి కూడా లిస్టులో ఉన్నారు. మైహోమ్​ కన్​స్ట్రక్షన్స్​ అధినేత జూపల్లి రామేశ్వర్​రావు రూ.9,490 కోట్లతో 13వ ప్లేస్​లో, అపర్ణ కన్​స్ట్రక్షన్స్​ ఓనర్స్​ వెంకటేశ్వర్​రెడ్డి (రూ.5,940 కోట్లు), ఎస్.సుబ్రమణ్యం రెడ్డి (రూ.5,880 కోట్లు) వరుసగా 16, 17 స్థానాల్లో నిలిచారు. రామ్​కీ ఎస్టేట్స్​ అండ్ ఫార్మ్స్​అధినేత అయోధ్య రామిరెడ్డి తొలిసారి ఇందులో చోటు దక్కించుకున్నారు. అలయన్స్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ​ఓనర్స్ సురేంద్ర బొమ్మిరెడ్డి, సురేశ్​ బొమ్మిరెడ్డి, సునీల్​ బొమ్మిరెడ్డిలు ఒక్కొక్కరు రూ.1,300 కోట్ల సంపదతో ఈ లిస్ట్​లోకి తాజాగా ఎంట్రీ ఇచ్చారు. తాజ్​ జీవీకే హోటల్స్​ ఓనర్​ జీవీకే రెడ్డి కూడా చోటు దక్కించుకున్నారు. 

గ్రోహ్​-హురున్​ ఇండియా రియల్​ ఎస్టేట్​ రిచ్​లిస్ట్​ 2023

గ్రోహ్​–హురున్​ ఇండియా రియల్​ ఎస్టేట్​ రిచ్​లిస్ట్​ 2023 ను బుధవారం రిలీజ్​ చేశారు. డీఎల్​ఎఫ్​ అధినేత రాజీవ్​ సింగ్​ రూ. 50,030 కోట్ల సంపదతో ఈ ఏడాది కూడా మొదటి ప్లేస్​లో నిలిచారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈయన సంపద 4 శాతం తగ్గింది. మాక్రోటెక్ డెవలపర్స్​ను నడిపే మంగళ్​ ప్రభాత్​ లోధా అండ్ ఫ్యామిలీ రూ. 42,270 కోట్ల సంపదతో రియల్ ఎస్టేట్ రిచ్​లిస్ట్​ 2023 లో రెండో ప్లేస్​ పొందారు. బెంగళూరు గ్రూప్​ ఆర్​ఎంజెడ్​ ఓనర్స్​ అర్జున్ మెండా అండ్ ఫ్యామిలీ రూ. 37 వేల కోట్ల సంపదతో మూడో ప్లేస్​సంపాదించుకుంది.  తెలంగాణలోని హైదరాబాద్​ నుంచి  గార్​ కార్పొరేషన్​ను నడుపుతున్న జీ అమరేంద్ర రెడ్డి రూ. 15 వేల కోట్ల సంపదతో టాప్​ టెన్​లో 10 వ ప్లేస్​లో నిలిచారు. ఈ ఏడాదే అమరేంద్ర రెడ్డి టాప్​10 లో మొదటిసారిగా స్థానం సంపాదించుకున్నట్లు గ్రోహ్​–హురున్​ రిపోర్టు వెల్లడించింది.

61 శాతం మంది సంపదలో పెరుగుదల

దేశంలోని 16 సిటీలలో 67 రియల్​ఎస్టేట్​ కంపెనీలను నడుపుతున్న 100 మంది వ్యక్తుల ర్యాంకులతో గ్రోహ్​–హురున్​ తన రిపోర్టును బుధవారం రిలీజ్​ చేసింది. తాజా లిస్ట్​లోని  61 శాతం మంది వ్యక్తుల సంపద పెరిగింది. ఇందులో 25  మంది లిస్ట్​లోకి కొత్తగా వచ్చినవారు ఉన్నారు. మరో 36 మంది వ్యక్తుల సంపద తగ్గిపోయింది.37 మంది రియల్​ ఎస్టేట్​ సంపన్నులతో మహారాష్ట్ర మొదటి ప్లేస్​లో నిలవగా, 23 మంది సంపన్నులతో ఢిల్లీ రెండో ప్లేస్​లోనూ, 18 మంది సంపన్నులతో బెంగళూరు మూడో ప్లేస్​లోనూ నిలిచాయి. సిటీల వారీగా చూసినప్పుడు హైదరాబాద్​ నుంచి 10 మంది వ్యక్తులు రియల్​ ఎస్టేట్​ సంపన్నులుగా ఈ లిస్ట్​లో ప్లేస్​ సంపాదించుకున్నారు.  గ్రోహ్​–హురున్​ రియల్​ ఎస్టేట్​ రిచ్​లిస్ట్​ 2023లో 25 శాతం మంది కొత్తవారే ఉన్నారని హురున్​ ఇండియా ఎండీ అనాస్​ రహ్మాన్​ జునైద్​ చెప్పారు.

రియల్​ ఎస్టేట్​ ఎంట్రప్రెనూర్లు ఎంతగా సంపద సృష్టిస్తున్నారో దీనిని బట్టి అర్ధమవుతుందని పేర్కొన్నారు. టాప్​ 100 రియల్​ ఎస్టేట్ ఎంట్రప్రెనూర్ల మొత్తం సంపద రూ. 4,72,330 కోట్లు. అంతకు ముందు ఏడాది కంటే ఇది 4 శాతం ఎక్కువైంది. ఫీనిక్స్​ మిల్స్​ ఓనర్స్​ అతుల్​ రూయా ఫ్యామిలీ రూ. 12,160 కోట్ల సంపదతో 11 వ ప్లేస్​లోనూ, రున్వాల్​ డెవలపర్స్​ నడుపుతున్న సుభాష్​ రున్వాల్​ ఫ్యామిలీ రూ. 10,260 కోట్ల సంపదతో 12 వ ప్లేస్​లోనూ, మై హోమ్​ కన్​స్ట్రక్షన్స్​ నడిపే జూపల్లి రామేశ్వర్​ రావు ఫ్యామిలీ రూ. 9,490 కోట్ల సంపదతో 13వ ప్లేస్​లోనూ నిలిచారు. తాజ్​ జీవీకే హోటల్స్​ఓనర్స్​​ జీవీకే రెడ్డి ఫ్యామిలీ కూడా టాప్​ 100 లిస్ట్​లో ప్లేస్​ సంపాదించుకుంది. రామ్​కీ ఎస్టేట్స్​ అండ్​ఫార్మ్స్​పేరుతో కంపెనీ నిర్వహిస్తున్న ఎంపీ అయోధ్య రామి రెడ్డి తొలిసారిగా గ్రోహ్​–హురున్​ రియల్​ ఎస్టేట్​ రిచ్​లిస్ట్​లో ప్లేస్​పొందారు. ఈయన సంపద రూ. 1,420 కోట్లు. అలయన్స్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​నడుపుతున్న సురేంద్ర బొమ్మిరెడ్డి రూ. 1,300 కోట్లు, సురేష్​ బొమ్మిరెడ్డి రూ. 1,300 కోట్ల సంపదతో ఈ లిస్ట్​లో ఎంట్రీ ఇచ్చారు. అపర్ణ కన్​స్ట్రక్షన్స్​ కంపెనీని నడిపే సీ వెంకటేశ్వర రెడ్డి, ఎస్​ సుబ్రమణ్యం రెడ్డిలు తాజా లిస్ట్​లో 16, 17 ప్లేస్​లు పొందారు.