
పది మంది సభ్యుల అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సైబాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ముఠా సభ్యులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా ముందు హాజరుపరిచారు. ఈ ముఠా సభ్యులపై ఇప్పటికే పలు కేసులున్నాయని చెప్పారు. నగరంలోని జగద్గిరిగుట్టలోని అంబేద్కర్ కాలనీలో దొంగలు షెల్టర్ తీసుకున్నారని తెలిపారు. ముఠా సభ్యులు దొంగతనాల్లో ఆరితేరారని చెప్పారు. చోరీకి పాల్పడే ప్రాంతాన్ని ముందే పూర్తిగా పరిశీలిస్తారని… నేరం చేసే ప్రయత్నంలో ఆయుధాలు ఉపయోగిస్తారని చెప్పారు. అంతేకాదు చోరీ సమయంలో అడ్డువచ్చేవారిని చంపేందుకైనా వెనుకాడరన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వీరు నేరాలకు పాల్పడ్డారని, వాటిపై ఇంకా విచారించాల్సి ఉన్నదని చెప్పారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు సీపీ సజ్జనార్.