V6 News

విజయ్ అఫిడవిట్లలో 100 కోట్ల వ్యత్యాసం.. ఐటీ శాఖకు మద్రాస్ హైకోర్టు ఆదేశం

విజయ్ అఫిడవిట్లలో 100 కోట్ల వ్యత్యాసం.. ఐటీ శాఖకు మద్రాస్ హైకోర్టు ఆదేశం

చెన్నై: సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్​విజయ్ ఎన్నికల అఫిడవిట్లలో రూ.100 కోట్లకు పైగా వ్యత్యాసం ఉందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌‌‌‌పై స్పందించాలని మద్రాస్ హైకోర్టు ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చి(ఈస్ట్), పెరంబూర్ నియోజకవర్గాల నుంచి విజయ్​పోటీ చేస్తున్నారు. 

అయితే, ఈ రెండు స్థానాలకు సంబంధించి విజయ్ దాఖలు చేసిన అఫిడవిట్లలో అతని ఆదాయంలో వ్యత్యాసం ఉందని ఆరోపిస్తూ పెరంబూర్‌‌‌‌కు చెందిన ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తిరుచ్చి నుంచి దాఖలు చేసిన పత్రాల్లో విజయ్​తన ఆదాయం రూ.220 కోట్లుగా పేర్కొన్నారు. పెరంబూర్ సీటు కోసం దాఖలు చేసిన అఫిడవిట్‌‌‌‌లో రూ. 115 కోట్లుగా చూపించారు. దీంతో ఈ భారీ వ్యత్యాసంపై స్పందించాలని మద్రాస్ హైకోర్టు ఇన్​కమ్​ట్యాక్స్​విభాగానికి ఆదేశాలు జారీ చేసింది.