రాతపూర్వక కారణాలు చెప్పకుండా అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లదు.. పోలీసుల ఇష్టారాజ్యానికి సుప్రీం బ్రేక్

రాతపూర్వక కారణాలు చెప్పకుండా అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లదు.. పోలీసుల ఇష్టారాజ్యానికి సుప్రీం బ్రేక్
  • ఆర్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22(1) కింద రాజ్యాంగ హక్కుకు భంగం
  • సంబంధిత అధికారిపై శాఖాపరమైన విచారణ
  • రీ- అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మేజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుమతి తప్పనిసరి
  • తదుపరి దర్యాప్తు మరో అధికారికి అప్పగించాలన్న సుప్రీం

న్యూఢిల్లీ: అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే సమయంలో నిందితుడికి రాతపూర్వకంగా, అతడికి అర్థమయ్యే భాషలో కారణాలు తెలియజేయడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కారణాలు లిఖిత పూర్వకంగా ఇవ్వకుండా అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ముల్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖా నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి జస్కరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్భంగా కారణాలను రాతపూర్వకంగా అందించకపోవడంతో సుప్రీంకోర్టు ఆ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అక్రమంగా ప్రకటించింది. 

ఈ కేసును సోమవారం జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భుయాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.చంద్రకూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన పోలీసు అధికారిపై శాఖాపరమైన విచారణ జరపాలని ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 22(1) కింద అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణాలు తెలుసుకునే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కు అని పేర్కొంది. తర్వాత చార్జిషీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసినా, కోర్టు కాగ్నిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్నా.. మొదట జరిగిన అక్రమ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోపం సరిదిద్దబడదని స్పష్టం చేసింది. 

ఇలాంటి అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి విడుదలైన వ్యక్తిని మళ్లీ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలంటే పోలీసులు తమంతట తాము నిర్ణయించుకోవడం కుదరదని తేల్చింది. ముందుగా అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణాలను రాతపూర్వకంగా అందించి, మేజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు దరఖాస్తు చేయాలని సూచించింది. మొదటిసారి అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమయంలో కారణాలు ఎందుకు ఇవ్వలేకపోయారో కూడా వివరించాలని, మళ్లీ అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరమా? వద్దా? అన్నది మేజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్ణయించాలని స్పష్టం చేసింది. 

రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించిన అదే అధికారికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించకుండా మరో అధికారికి దర్యాప్తు బదిలీ చేయాలని ఆదేశించింది. ఉల్లంఘనకు పాల్పడిన అధికారిపై శాఖాపరమైన చర్యలతోపాటు సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డులో నమోదు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పు కాపీని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలకు పంపాలని ఆదేశించింది.