రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1054 కరోనా కేసులు నమోదయ్యాయి. 795 మంది కరోనా నుంచి కోలుకోగా..5992 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.77 శాతం ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 6 కోట్ల 57 లక్షల 7వేల775 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. హైదరాబాద్ లో అత్యధికంగా 396 కేసులు నమోదవగా..మేడ్చల్ 60, రంగారెడ్డి 60, నల్గొండ 49, కరీంనగర్ 46, రాజన్న సిరిసల్ల 36, ఖమ్మంలో 35 కేసులు నమోదయ్యాయి.