అతని వయస్సు 109 ఏళ్లు.. ఈ 12 పనులు రోజూ చేస్తాడు.. ఇప్పటి వరకు ఆస్పత్రికి వెళ్లలేదు

అతని వయస్సు 109 ఏళ్లు.. ఈ 12 పనులు రోజూ చేస్తాడు.. ఇప్పటి వరకు ఆస్పత్రికి వెళ్లలేదు

ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోరుకుంటారు, కానీ తెలిసో, తెలియక జీవనశైలిలో మార్పుల వల్ల  వయస్సుతో పాటే అనారోగ్యాలూ పెరుగుతూ వస్తున్నాయి. కానీ సుదీర్ఘ జీవితాన్ని ఆరోగ్యంగా గడపాలనుకుంటే మౌరీ మార్కోఫ్ ను ఫాలో కావాల్సిందే.109వ పుట్టినరోజును జరుపుకున్న మౌరీ మార్కోఫ్ అనే వ్యక్తి .. ఆరోగ్యకరమైన జీవితానికి తాను పాటించే 12 ముఖ్యమైన రహస్యాలను పంచుకున్నాడు. దీంతో మౌరీ వైరల్‌గా మారాడు. ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆయన్ను కొనియాడుతున్నారు.

ప్రతి క్షణం జీవించడమే సంతోషకరమైన జీవితానికి మొదటి పాఠం అని మార్కోఫ్ చెప్పారు. అతను చాలా సార్లు మరణం నుంచి తప్పించుకున్నానని, కానీ అది ఎలా జరిగిందో తనకు తెలియదన్నాడు. ఎందుకంటే తాను ఎప్పుడూ దాని గురించి పెద్దగా ఆలోచించనని, తన ఆరోగ్య జీవితానికి గల రహస్యాలను ఈ విధంగా పంచుకున్నారు.

  • బాగా నిద్రపోతాను. ఇది నా చిన్నప్పటి నుండి నేర్చుకున్నాను. మేము ఒక మురికి వీధిలో నివసించే వాళ్లం. ఆ ప్రాంతం ఎప్పుడూ  చాలా చల్లగా ఉంటుంది. అదెలా ఉంటుందో చెప్తే మీరు జీవించలేరు. 
  • ఎల్లప్పుడూ చురుకుగా ఉంటాను.  నన్ను నేను జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్ని్స్తూ ఉంటాను. 
  • అనారోగ్యంతో ఉంటే తప్ప, పడుకోవడానికి ఇష్టపడను. నా భార్యతో కలిసి ప్రతిరోజూ 3.2 మైళ్ళు నడుస్తాను.
  • నచ్చింది తింటాను. నా ఆహారంపై ఎప్పుడూ పెద్దగా శ్రద్ధ చూపలేదు. విటమిన్లు లేదా మాత్రలు తీసుకోలేదు. ఎప్పుడూ ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే తినాలని నిబంధనేం పెట్టుకోను. సాధారణ ఆహారం తీసుకుంటూ, పంపు నీటిని తాగుతాను.
  • నేను ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు. కాబట్టి దాని గురించి ఆలోచించను. 
  • నేను ఉదయాన్నే నిద్రలేచి, వీలైనంతవరకూ జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాను. వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే. దాని గురించి కూడా ఎప్పుడూ ఆలోచించను. 
  • నాకు16 సంవత్సరాల వయస్సు నుంచే ధూమపానం చేసే అలవాటుంది. రోజుకు రెండు, మూడు ప్యాక్‌లు తీసుకుంటాను. దాని వల్ల నాకు నాలుక క్యాన్సర్ కూడా వచ్చింది.
  • చదివే అలవాటును ఎప్పుడూ వదులుకోవద్దు. నేను 6 సంవత్సరాల వయస్సు నుంచి ఏదో ఒకటి చదువుతూనే ఉన్నాను. 
  • మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. కానీ వీలైతే అలాంటి వాటికి దూరంగా ఉండండి. అవసరమైన వస్తువులను మాత్రమే మీ వద్ద ఉంచుకోండి. 
  • పేదరికం ఉన్నప్పటికీ ఎప్పుడూ ఆకలితో ఉండలేదు. చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్లు అమ్మడం, పండ్ల దుకాణం పెట్టడం, పిండి వంటలు అమ్మడం వంటి ఎన్నో పనులు చేశాను.
  • నా సంస్కృతిని ఎప్పటికీ మర్చిపోలేదు. నన్ను నేను ఇష్టపడతాను, ప్రేమించుకుంటాను. అదే ప్రేమను ఇతరులకూ పంచుతాను. ఎందుకంటే మన ప్రేమ ఎప్పుడూ నాశనం కాదు. దాని వల్ల ఎప్పుడూ నష్టం ఉండదు. 
  • నా పళ్లను జాగ్రత్తగా చూసుకుంటాను. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటాను.

అంటూ  మార్కోఫ్ తాను ఆరోగ్యంగా ఉండడానికి గల కారణాలను వివరణాత్మకంగా ఓ పుస్తకం ద్వారా తెలియజేశారు.