పీర్జాదిగూడలో కోడి పందేలు.. 11 మంది అరెస్ట్

 పీర్జాదిగూడలో కోడి పందేలు.. 11 మంది అరెస్ట్

మేడిపల్లి, వెలుగు:  మేడిపల్లి పీఎస్​పరిధిలో కోడి పందేలు వేస్తున్న 11 మందిని పోలీసులు అరెస్ట్​చేశారు. 22 కత్తులు, 3కోళ్లు, రూ.39,600 క్యాష్​ను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడ పరిధిలోని సత్యనారాయణపురం కాలనీలోని ఓ ఖాళీ ప్రదేశంలో మంగళవారం కోడి పందేలు వేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి, కోడి పందేలు వేస్తున్న 11మందిని అరెస్ట్​చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.