తూప్రాన్ పట్టణంలోని 11 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత : సివిల్ సప్లయ్ ఇన్ స్పెక్టర్   నర్సింలు

తూప్రాన్ పట్టణంలోని 11 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత : సివిల్ సప్లయ్ ఇన్ స్పెక్టర్   నర్సింలు

తూప్రాన్, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 11.90 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సివిల్ సప్లయ్​ ఇన్​స్పెక్టర్​   నర్సింలు తెలిపారు. తూప్రాన్ పట్టణంలోని అల్లాపూర్ చౌరస్తా వద్ద సోమవారం వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 11 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తూప్రాన్ పోలీసులతో కలిసి పట్టుకుని వాహనాన్ని సీజ్ చేశామన్నారు.

డ్రైవర్ నింగ క్రిష్ణ, కైలాస శ్రీనివాస్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.