కంటి వ్యాధులను గుర్తించే యాప్.. 11ఏళ్ల చిన్నారి ఆవిష్కరణ

కంటి వ్యాధులను గుర్తించే యాప్.. 11ఏళ్ల చిన్నారి ఆవిష్కరణ

కేరళకు చెందిన 11ఏళ్ల చిన్నారి అద్భుతం ఆవిష్కరించింది. ఐఫోన్ సాయంతో కంటి వ్యాధులను గుర్తించే ఏఐ బేస్డ్ యాప్ ను రూపొందించి రికార్డు సృష్టించింది. ఈ చిన్నారి టాలెంట్ కు మెచ్చిన నెటిజన్లు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

 లీనా రఫీక్ అనే కేరళకు చెందిన సెల్ఫ్ కోడర్.. తన అసాధారణ విజయాన్ని లింక్డ్‌ఇన్‌ను ద్వారా షేర్ తెలియజేశారు. ఆమె అభివృద్ధి చేసిన యాప్ కంటి వ్యాధులు ఆర్కస్, మెలనోమా, టెరీజియం, క్యాటరాక్ట్ వంటి వాటిని గుర్తించడానికి ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. 10 ఏళ్ల వయసులోనే 'ఓగ్లర్ ఐ స్కాన్' అనే యాప్‌లో పనిచేయడం ప్రారంభించానన్నారు. కంప్యూటర్ విజన్, అల్గారిథమ్‌లు, మెషిన్ లెర్నింగ్ మోడల్స్, ఐ కండిషన్స్, యాపిల్ ఐఓఎస్‌లోని అధునాతన టెక్నాలజీతో సహా వివిధ విషయాలను అర్థం చేసుకోవడానికి తనకు ఆరు నెలల పట్టిందని లీనా స్పష్టం చేశారు. ఆ తర్వాత యాప్ ను ఆప్ స్టోర్ లో సబ్మి్ట్ చేశానని పోస్టులో తెలిపారు.

లీనా షేర్ చేసిన ఈ పోస్టు.. నెటిజన్లను దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తోంది. సమాజానికి ప్రయోజనకరమైన యాప్ ను క్రియేట్ చేసినందుకు పొగడుతూ ఆ చిన్నారిని అందరూ కొనియాడుతున్నారు.  ఏఐ బేస్డ్ మొబైల్ యాప్‌ను రూపొందించడంలో మీరు విజయం సాధించారన్న నిజం వినడానికి చాలా బాగుందంటూ కామెంట్ చేస్తున్నారు. 10 సంవత్సరాల వయస్సులోనే ఇంత అద్భుతమైన ఉద్యోగం పొందారంటూ మరికొందరు రిప్లై ఇస్తుండగా.. "వావ్, అద్భుతంగా ఉంది! మీరు Ogler EyeScanని సృష్టించినందుకు అభినందనలు" అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.