రేప్ చేసి వీడియో వైరల్.. 12 మంది అరెస్ట్‌

రేప్ చేసి వీడియో వైరల్.. 12 మంది అరెస్ట్‌

బెంగళూరులో బంగ్లాదేశ్‌ యువతిని గ్యాంగ్ రేప్ చేసి, వీడియోలు వైరల్ చేసిన కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేశామని, కోర్టుకు చార్జ్‌షీట్‌ సబ్మిట్ చేశామని చెప్పారు. ఈ కేసులకు సంబంధించిన పురోగతి గురించి ఆయన గురువారం ట్వీట్ చేశారు. ‘‘అత్యంత వేగంగా కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. 12 మంది నిందితులను అరెస్టు చేశాం. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. నిందితుల్లో 11 మంది బంగ్లాదేశీయులే. ఈ కేసులో 1,019 పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించాం” అని కమల్ పంత్ పేర్కొన్నారు. ఈ కేసును వేగంగా పూర్తి చేసిన దర్యాప్తు టీమ్‌ను అభినందిస్తున్నామని, వారికి రూ. లక్ష రివార్డు ఇస్తున్నామని చెప్పారు. 
కేసు ఇదీ..
బంగ్లాదేశ్‌కు చెందిన 22 ఏండ్ల మహిళను ఓ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ఆ దేశం నుంచి మూడేళ్ల క్రితం భారత్‌కు తరలించింది. కర్ణాటకలోని బెంగళూరుకు తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దించి, వ్యాపారం చేసింది. అయితే ఆ ముఠా సభ్యుల మధ్య ఆర్థిక విభేదాలు రావడంతో ఆమెను క్రూరంగా హింసించడంతో పాటు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఆమె ప్రైవేట్ భాగాల్లో బాటిల్స్ పెట్టి హింసించి, పైశాచిక ఆనందం పొందారు. వాళ్ల అకృత్యాలకు సంబంధించిన వీడియో మే నెలలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేశారు.