- 12 మంది గాయాలు
- మూడు ముక్కలుగా విరిగిన స్తంభం
కౌడిపల్లి, వెలుగు: హైదరాబాద్–- మెదక్ నేషనల్హైవేపై కౌడిపల్లి మండలం ధర్మసాగర్ గేట్ వద్ద ఆదివారం మినీ బస్సు బోల్తా పడడంతో 12 మంది గాయపడ్డారు. హైదరాబాద్లోని నల్లకుంటకు చెందిన కొంతమంది ఆదివారం మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ భవానీ మాత దర్శనానికి వస్తున్నారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సు ధర్మసాగర్ గేట్ వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిబోల్తా పడింది.
ఈ ఘటనలో స్తంభం మూడు ముక్కలుగా విరిగిపోయింది. కరెంట్ వైర్లు తెగి కింద పడిపోయాయి. బస్సులోని ఉమారాణి, కృష్ణ ప్రసాద్, వాణికి తీవ్ర గాయాలు కాగా, మరో 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. దెబ్బలు తగిలిన వారిని 108 అంబులెన్స్ లో నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
