కప్ కొట్టి భారత్కి తీసుకొని రండి.. పాక్తో పోరుకు ముందు ఉమెన్స్ టీమ్‌కు రోహిత్, గంభీర్ స్పెషల్ మెసేజ్

కప్ కొట్టి భారత్కి తీసుకొని రండి.. పాక్తో పోరుకు ముందు ఉమెన్స్ టీమ్‌కు రోహిత్, గంభీర్ స్పెషల్ మెసేజ్

India Women Cricket Team: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కాసేపట్లో (ఆదివారం) పాకిస్తాన్‌తో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు హర్మన్‌ప్రీత్ సేనకు మెన్స్ టీమిండియా ఆటగాళ్లు అదిరిపోయే సపోర్ట్ ఇచ్చారు. గతేడాది సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుని హిస్టరీ క్రియేట్ చేసిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు తమ తొలి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను ముద్దాడాలనే కసితో బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో బీసీసీఐ (BCCI) ఎక్స్ (X) వేదికగా షేర్ చేసిన ఒక ప్రత్యేక వీడియోలో రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లు మహిళల జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ జోష్ నింపారు.

ఈసారి కప్పు కొట్టాల్సిందే: రోహిత్ శర్మ
గత కొన్ని ఏళ్లుగా టీమిండియా అమ్మాయిలు అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నారని భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్‌లలో చాలాసార్లు గెలుపుకు అత్యంత దగ్గరగా వచ్చి మిస్ అయ్యారు. కానీ, ఈసారి మాత్రం వాళ్లు కచ్చితంగా కప్పు కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. దేశం మొత్తం వాళ్లకు సపోర్ట్‌గా ఉంది.. మన జట్టు చాలా పటిష్టంగా, బ్యాలెన్స్‌డ్‌గా ఉంది.. ఇంగ్లాండ్ కండిషన్స్‌ని వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు.. మెన్స్ టీమిండియా తరఫున అమ్మాయిలందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ రోహిత్ విష్ చేశాడు.

►ALSO READ | వాడే భారత జట్టుకు బిగ్గెస్ట్ వీక్‌నెస్.. గంభీర్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి.. 

కప్పుని భారత్ కి పట్టురండి: కోచ్ గంభీర్ 
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన స్టైల్‌లో పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చాడు. మీరు 140 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ప్రపంచ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం అందరికీ రాదు.. మైదానంలో తప్పులు జరుగుతాయేమోనని అస్సలు భయపడకండి.. ఎప్పుడు డౌట్ వచ్చినా పాజిటివ్ రూట్‌నే ఎంచుకోండి.. గుడ్ లక్.. కప్పు ఇంటికి (భారత్ కి) పట్టురండి అంటూ గంభీర్ కోరాడు. 

గిల్, శ్రేయస్, ఇషాన్ ‘కిర్రాక్’ మోటివేషన్: 
* కెప్టెన్ శుభ్‌మన్ గిల్: మీరు గతంలోనే వరల్డ్ కప్ గెలిచి హిస్టరీ క్రియేట్ చేశారు.. ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తారు. మా పూర్తి మద్దతు మీకే ఉంటుందని పేర్కొన్నాడు. 

* టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్: భారత మహిళల జట్టుకు నా బెస్ట్ విషెస్.. మైదానంలో ఎవరికీ భయపడకండి (Fearless).. ప్రత్యర్థులపై దయ చూపకుండా (Ruthless) కేవలం గెలుపు కోసమే ఆడండి అని సూచించాడు. 

* ఇషాన్ కిషన్: దీనిని కూడా ఒక నార్మల్ మ్యాచ్ లాగే భావించండి.. ఈ సీజన్ మొత్తం మీరు అమేజింగ్ క్రికెట్ ఆడారు.. కాబట్టి ప్రెజర్ తీసుకోకుండా సింపుల్‌గా ఆడండి, మీ ప్రాసెస్ ని నమ్మండి.. అంతా మంచే జరుగుతుంది.. మీ ఆటని చూసి మేమంతా ఎంతో గర్వపడుతున్నామని వెల్లడించాడు.