హైదరాబాద్‎లో ట్రాఫిక్ జామ్స్‎కు చెక్.. రంగంలోకి హైడ్రా బైక్స్

హైదరాబాద్‎లో ట్రాఫిక్ జామ్స్‎కు చెక్.. రంగంలోకి హైడ్రా బైక్స్

హైదరాబాద్: వర్షకాలం ప్రారంభం నేపథ్యంలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నగరవ్యాప్తంగా 27 బైక్ టీమ్స్‎ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో రెస్పాండ్ టైమ్‏ను తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ట్రాఫిక్ జామ్‏ల కారణంగా వర్షాల వల్ల చెట్లు కూలిపోయిన ఏరియాలకు, వాటర్ లాగింగ్ ప్రాంతాలకు హైడ్రా టీమ్స్ త్వరగా వెళ్లలేకపోతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే అదనపు బైక్ టీమ్‌లను రంగంలోకి దించింది హైడ్రా. నగర వ్యాప్తంగా 27 బైక్ టీమ్స్‎ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ట్రాఫిక్‌‎లో కూడా ఘటన స్థలాలకు వేగంగా చేరుకుంటున్నాయి హైడ్రా బైక్ టీమ్‌‎లు. 

►ALSO READ | వర్క్ ఫ్రమ్ బైక్ వైరల్ వీడియో.. ఆత్రం ఎక్కువైతే ప్రాణం పోద్ది.. యువకుడికి సజ్జనార్ వార్నింగ్

ప్రతి బైక్ టీమ్‌‎కు ట్రీ బ్రాంచ్ కట్టర్స్, రోప్స్, స్పేడ్ వంటి ప్రాథమిక పరికరాలు అందుబాటులో ఉంచారు. చెట్లు కూలిన ఘటనలపై తక్షణ స్పందన ఇచ్చి రోడ్లను క్లియర్ చేయడంలో బైక్ టీమ్‌‏లది కీలక పాత్ర. అత్యవసర పరిస్థితుల్లో రెస్పాండ్ టైమ్‎ను తగ్గించడమే బైక్ టీమ్‌ల ప్రధాన ఉద్దేశ్యం. వర్షాకాలంలో నగర ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ఈ బైక్ టీమ్‌లను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది హైడ్రా.