భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. బర్మింగ్‌హామ్‌లో థండర్‌స్టార్మ్ అలర్ట్!

భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. బర్మింగ్‌హామ్‌లో థండర్‌స్టార్మ్ అలర్ట్!

India vs Pakistan Women's T20 World Cup 2026: మహిళల టీ20 వరల్డ్ కప్ (Women T20 World Cup) లో భాగంగా కాసేపట్లో (జూన్ 14) బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. హోమ్ గ్రౌండ్‌లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జోష్‌తో ఉన్న హర్మన్‌ప్రీత్ సేనపై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ, ఇంగ్లాండ్ వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టం కాబట్టి, ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పుపై ఫ్యాన్స్‌లో టెన్షన్ నెలకొంది.

ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ: 
ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌లో చల్లని వాతావరణం ఉన్నప్పటికీ, క్రికెట్ అభిమానులకు వాతావరణ శాఖ ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. టాస్ పడే సమయానికి అక్కడ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే టాస్ సమయంలో వర్షం పడే ఛాన్స్ కేవలం 2 శాతం మాత్రమే.. మ్యాచ్ జరుగుతున్నంత సేపు కూడా వర్షం పడే అవకాశం 2 నుంచి 3 శాతానికి మించకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఎలాంటి అంతరాయాలు లేకుండా భారత్ వర్సెస్ పాకిస్తాన్ పూర్తి 40 ఓవర్ల పాటు జరగబోతుంది. 

►ALSO READ | పాక్ కెప్టెన్కి హర్మన్‌ప్రీత్ షేక్ హ్యాండ్ ఇస్తుందా?.. నెట్టింట జోరుగా చర్చ!

మొదట ఆడేవాళ్లకే అడ్వాంటేజ్: 
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికీ సమంగా అనుకూలించే ఒక బ్యాలెన్స్‌డ్ వికెట్.. కానీ, మ్యాచ్ ప్రారంభంలో పిచ్ నుంచి లభించే మూవ్‌మెంట్ కారణంగా ఫాస్ట్ బౌలర్లకు ఇక్కడ మంచి సపోర్ట్ దొరుకుతుంది. కొత్త బంతితో పేసర్లు వికెట్లు తీసే అవకాశం ఉంది. ఈ మైదానంలో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 165 నుంచి 170 పరుగుల వరకు ఉంటుంది. గత 10 రోజులుగా బర్మింగ్‌హామ్‌లో క్రికెట్ ఆడేందుకు పర్ఫెక్ట్ వాతావరణం ఉంది. అక్కడ సగటు ఉష్ణోగ్రత 15 నుంచి 17 డిగ్రీల మధ్య రికార్డ్ అయింది.