కొణిజర్ల, వెలుగు: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో ఈగల్ ఫోర్స్, కొణిజర్ల పోలీసులు తనిఖీలు నిర్వహించి రూ. కోటి విలువైన 200 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పారా బాయిల్ మిల్లు వద్ద కూరగాయల వాహనంతో పాటు కారును తనిఖీ చేశారు. ఈ దాడుల్లో 104 ప్యాకెట్లలో ఉన్న గంజాయి పట్టుబడింది.
మహారాష్ట్రకు చెందిన అమోల్ నానోబా గోరే, లక్ష్మణ్ నాగనాథ్ కరేతో పాటు కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన వసంత్ జాదవ్, షేక్ అన్సార్, షేక్ రహ్మత్‌ను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని ఉద్గిర్‌కు చెందిన ప్రభు ఈ ముఠాకు ఫైనాన్షియర్‌గా వ్యవహరిస్తుండగా, ఒడిశాకు చెందిన దేవీసింగ్ సప్లై చేస్తున్నట్లు తేలింది. ఈ దాడిలో కొణిజర్ల ఎస్సై జి సూరజ్, ఈగల్ టీమ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
