శ్రీశైలం పవర్ ప్లాంట్లో రూ.1200 కోట్ల నష్టం

శ్రీశైలం పవర్ ప్లాంట్లో రూ.1200 కోట్ల నష్టం

హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో జెన్‌‌కోకు భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్లాంట్‌‌ లోని అన్ని యూనిట్లు తిరిగి నడవాలంటే రూ.1200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని ఎక్స్ పర్స్ట్ అంచనా వేస్తు న్నారు. ప్లాంట్ లోని 6 యూనిట్లలో 4 యూనిట్లు దాదాపు 50 శాతానికి దెబ్బతిన్నట్లుతెలిసింది. మిగతా రెండు యూనిట్లు స్వల్పంగా డ్యామేజ్ అయినట్లు సమాచారం. 4 జనరేటర్లు మేజర్‌‌ డ్యామేజ్‌‌కాగా, ఒక మెయిన్ ట్రాన్స్ ఫార్మర్, ఆరు యూనిట్లకు చెందిన ఎక్సిటేషన్ ప్యానెల్స్ పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. జనరేటర్లు, ప్యానెళ్లు, స్టాటర్లు, రోటర్లు డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. ప్రమాదంపై చేస్తున్న విచారణలో నిర్వహణ లోపాలు, టెక్నికల్‌‌ సమస్యలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మెయింటనెన్స్‌ ‌సరిగా లేకనే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనాకు వస్తున్నారు. సీఐడీ టీమ్స్ జెన్‌‌కో సిబ్బందిని విచారిస్తుండగా, టెక్నికల్‌ ‌కమిటీ పవర్‌‌ప్లాంట్‌‌ లో సాంకేతిక సమస్యలను అన్వేషిస్తోంది. బ్యాటరీలు బిగిస్తున్నప్పుడు ప్యానెల్‌ ‌బోర్డులో షార్ట్‌‌సర్క్యూట్‌‌ అయిందని, జనరేటర్లను  నియంత్రించే సెన్సారకు్ల డీసీ సప్లై కాకపోవడంతో లోడ్‌ ‌పెరిగి మంటలు చెలరేగినట్లు అధికార వర్గాలు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లుసమాచారం. జనరేటర్‌‌ను నియంత్రించే సెన్సార్ కు డీసీ సప్లైలేక విద్యుత్ సరఫరా కాకపోవడంతోనే ప్రమాదం జరిగిందని అంచనాకు వస్తున్నారు.

లోపమా? సమస్యా?

ఇన్వెస్టిగేషన్ అధికారులు టెక్నికల్‌‌ సమస్యనా? లేక అధికారుల నిరక్ష్యమా? అనే  కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీల మెయింటనెన్స్‌‌కు కొత్త ఎక్విప్‌‌మెంట్ ను శాంక్షన్ చేయడంలో ఓ కీలకమైన అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆ ఉన్నతాధికారి ప్రమాదం జరిగిన రోజున హైదరాబాద్ నుంచి వచ్చి బ్యాటరీలను మార్పించే పనులపై హడావిడి చేశారని, ప్లాంట్‌‌ సిబ్బంది అభ్యంతరం వ్యక్తంచేసినా, చెప్పింది చేయాల్సిందేనని ఆర్డర్  చేశారనే వాదనలు ఉన్నాయి.