- మల్టీ జోన్-1లో 67, మల్టీ జోన్-2లో 57 మందికి చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఎంపీఓలు (మండల పంచాయతీ ఆఫీసర్లు), సూపరింటెండెంట్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 124 మందికి ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. నేడో, రేపో పంచాయతీరాజ్ శాఖఉత్తర్వులు జారీ చేయనున్నది.
మొత్తం 124 మందిలో మల్టీ జోన్-–1లో 67 మందికి, మల్టీ జోన్–-2కు సంబంధించి 57 మందికి పదోన్నతులు లభించాయి. ఎంపీడీఓ పోస్టుల భర్తీతో గ్రామీణాభివృద్ధి పాలన మరింత వేగవంతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
