భవనంలో భారీ పేలుడు.. 14 మంది మృతి

భవనంలో భారీ పేలుడు.. 14 మంది మృతి

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని  ఏడంతస్తుల భవనంలో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు దాటికి 14 మంది మృతి చెందగా..100 మందికి గాయాలయ్యాయి.  ఘటనా స్థలానికి చేరుకున్న  ఫైర్ సిబ్బంది  సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. గాయపడిన వారిని  ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు  పోలీసులు తెలిపారు.  వీరంతా ఐసీయూలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.  పేలుడు దాటికి బిల్డింగ్ లోని రెండు అంతస్తులు పూర్తిగా ధ్వంసం అయ్యాయని తెలిపారు. అలాగే బిల్డింగ్ ఎదుట ఉన్న బస్సు కూడా పూర్తిగా దగ్ధం అయినట్లు వెల్లడించారు.   అయితే ఘటనకు కారణాలేంటనేవి తెలియాల్సి ఉంది. భవనం కింద చాలా మంది చిక్కుకుపోయినందున  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.