
హైదరాబాద్, వెలుగు: ‘అమృత్ భారత్’ స్కీమ్ లో భాగంగా రాష్ట్రంలోని 15 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించనున్నట్టు సౌత్సెంట్రల్రైల్వే జనరల్మేనేజర్అరుణ్కుమార్జైన్ తెలిపారు. దేశవ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ.. 1,500 ఆర్ ఓబీలు, ఆర్ యూబీలకు ప్రధాని మోదీ సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.1,600 కోట్లకు పైగా వ్యయంతో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, బ్రిడ్జీల పనులను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
నివారం మీడియాతో అరుణ్ కుమార్ జైన్ మాట్లాడారు. తెలంగాణలో 15 స్టేషన్లు, ఏపీలో 34, మహారాష్ట్రలో 6, కర్నాటకలో 2 స్టేషన్లను ఆధునికీకరించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం రూ.925 కోట్లు ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. జోన్ పరిధిలో రూ.676 కోట్లతో 156 ఆర్ఓబీలు, ఆర్ యూబీల నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేస్తారన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వేలోని రాష్ట్రాల్లో పూర్తయిన 57 అమృత్భారత్స్టేషన్లు, 156 ఆర్ఓబీ, ఆర్యూబీలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణలో భాగంగా ప్లాట్ ఫామ్స్, వెయిటింగ్ హాల్స్ నిర్మాణం, రోడ్లను విస్తరించడం, పార్కింగ్ఏరియా, మెరుగైన లైటింగ్, గ్రీనరీ ఏర్పాటు చేయడం తదితర పనులు చేస్తామన్నారు.