గండిపేటలో భూకబ్జా కేసులు ఛేదించారు శేరిలింగంపల్లి పోలీసులు. భూకబ్జా కేసులో నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయికిరణ్ లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో సంబంధం ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ పరారీలో ఉన్నారు. నిందితులు గండిపేట సర్వే నం.18లో భూకబ్జాకు యత్నించారిన శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
నకిలీ జీవోలతో గండిపేట పరిధిలో సర్వే నం.18లో 15వందల కోట్ల భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. భూమిని ప్రభుత్వం తమకు క్రమబద్దీకరించిందని ప్రచారం చేశారు. నిందితులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, నిమ్మల రాజేష్,వేణుగోపాల్, సాయికిరణ్ అనే వ్యక్తులు భూకబ్జాకు యత్నించారని గండిపేట ఎమ్మార్వో ఫిర్యాదు చేయడంతో భూకబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది.
భూకబ్జాకు గురైందని తెలుసుకున్న గండిపేట ఎమ్మార్వో నార్సింగి పీఎస్ లో నిందితులపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్లో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్ లను అరెస్ట్ చేశారు. ఈ భూకబ్జా బాగోతంలో కింగ్ పిన్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సునీల్, రాధాకృష్ణ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కోర్టు ఆదేశాలతో నిందితుల ఇళ్లలో సోదాలు చేసి బ్యాంకు పాస్ బుక్స్, మొబైల్స్ , ల్యాప్ గాప్ లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ పోరంబోకు భూమిపై హక్కులు అంటూ నిమ్మల కుటుంబం క్లెయిమ్ చేస్తూ వచ్చింది. హైకోర్టులో భూమి తమదే అని పిటిషన్లు దాఖలు చేశారు నిందితులు. అక్టోబర్ 2025లో నిందితుల పిటిషన్లు హైకోర్టు కొట్టివేసింది. చట్టబద్ధ హక్కులు లేకున్నా ఎకరాకు 3.5 కోట్లకు భూమి అమ్మకానికి కుట్ర చేశారని ఆరోపణలు ఉన్నాయి. బొల్లా రమేష్, బ్రహ్మ నాయుడులతో నిందితులు భూమి అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.
బొల్లా బ్రాహ్మనాయుడు వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. బొల్లా బ్రాహ్మ నాయుడు నుంచి రెండు సార్లు నిమ్మల ఫ్యామిలీకి డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఒకసారి కోటి రూపాయలు, మరోసారి 25 లక్షలు ట్రాన్స్ఫర్అయ్యాయి. అక్రమ భూ డీల్‌లో నాలుగు కోట్లు చేతులు మారినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.
