ధవళేశ్వరం వద్ద 16లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

ధవళేశ్వరం వద్ద 16లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

రెండో ప్రమాద హెచ్చరిక… కొనసాగింపు

రాజమండ్రి: గోదావరి నదిలో వరద ఉధృతి మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది.  వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న అధికారులు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ నీటిమట్టం 15.90 అడుగులకు పెరిగింది. నీటిమట్టం 16.10 అడుగులకు పెరగడంతో అధికారులు 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. 16.43 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

గోదావరిలో అనేక లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వారం రోజులుగా వరద బీభత్సంతో ముంపు గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా.. వాటిలో సరైన సదుపాయాలు లేక బాధితులు ఇబ్బంది పడుతున్నారు.