హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు.. అరెస్ట్ అయిన 16 మంది ఎవరు?

హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు.. అరెస్ట్ అయిన 16 మంది ఎవరు?

హైదరాబాదులో మరోసారి  ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ సాయంతో భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి 16 మందిని ఆదుపులోకి తీసుకున్నారు.  భోపాల్కు  చెందిన  11 మంది, హైదరాబాద్కు  చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. నిందుతులను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు మధ్యప్రదేశ్ కు తరలిస్తున్నారు.   

నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, సాహిత్యం, కత్తులు, ఎలక్ట్రానిక్ డివైస్‌, డ్రాగన్‌లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇస్లామిక్ జిహాదీని కూడా పోలీసులుల స్వాధీనం చేసుకున్నారు. వీరంతా 18 నెలల నుంచి హైదరాబాద్ లోనే  మకాం ఉంటున్నారు. యవతను ఉగ్రవాదం వైపు టెర్రరిస్టులు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను విచారిస్తే మరి కొన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది.

ఎక్కడో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన పోలీసులు.. హైదరాబాద్ లో 16 మందిని.. ఉగ్రవాదులు అనే అనుమానంతో అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. దీంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదే క్రమంలో ప్రజలు సైతం షాక్ అయ్యారు. హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు.. 16 మంది అరెస్ట్ వార్తలతో.. గతంలో లుంబిని పార్క్, దిల్ ఖుష్ నగర్, గోకుల్ చాట్ బాంబు పేలుళ్లను గుర్తు చేసుకుంటున్నారు. అసలే ఎన్నికల సమయం కావటంతో రాజకీయంగా హై ఓల్టేజీలో ఉన్నాయి పాలిటిక్స్. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ పోలీసులు.. హైదరాబాద్ వచ్చి మరీ 16 మందిని అరెస్ట్ చేయటం కలకలం రేపుతోంది.