పేదలకు గుడ్ న్యూస్ : హైదరాబాద్ లో 1,730 మందికి డబుల్ ఇండ్ల పంపిణీ

పేదలకు గుడ్ న్యూస్ :  హైదరాబాద్ లో 1,730 మందికి డబుల్ ఇండ్ల పంపిణీ

హైదరాబాద్​సిటీ, వెలుగు: పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిటీ ఇన్ చార్జి మంత్రి  పొన్నం ప్రభాకర్ అన్నారు. చార్మినార్, మలక్ పేట, యాకత్ పుర, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల లబ్ధిదారులకు మినిస్టర్ క్వార్టర్స్​లో డబుల్ బెడ్ రూం పట్టాలను ఆయన శుక్రవారం పంపిణీ చేశారు. ఈ డబుల్​బెడ్​రూమ్​ఇండ్లను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకల్​లో నిర్మించినట్లు తెలిపారు. 

సుమారు1,730 మంది లబ్ధిదారులకు అక్కడ ఇండ్లను కేటాయించారు. అంబర్​పేటకు చెందిన 134, బహుదూర్​ పురకు చెందిన - 294, బండ్లగూడ కు చెందిన - 155, చార్మినార్ కు చెందిన -209,  సైదాబాద్ కు చెందిన - 206, ఇతర ప్రాంతాల్లో ఉన్న 28 మందికి శుక్రవారం వీటిని అందజేశారు. మిగిలిన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు