ఈ ఏడాది ( 2026) మార్చి 3 వ తేదీన అత్యంత శక్తి వంతమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణ ప్రభావం ఎప్పుడు ప్రారంభమవుతుంది.. దీని ఎఫెక్ట్ ఎన్నిరోజులు ఉంటుంది. ఎలాంటి పరిహారాలు చేయాలి. జ్యోతిష్యులు.. వేద పండితులు ఏం చెబుతున్నారు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
మార్చి 3 వ తేదీన కేతు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడేతుంది. అయితే గ్రహణ ప్రభావం గ్రహణ ప్రభావం సూతకాలం అంటే గ్రహణ సమయానికి 9 గంటల ముందుగా ప్రారంభమవుతుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం సూతకాలం ప్రారంభమైన దగ్గరి నుంచి గ్రహణ ప్రభావం మొదలవుతుంది. ఈ గ్రహణం చాలా శక్తివంతమైనది. ప్రతి ఒక్కరిపై గ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
చంద్రగ్రహణం 2026 మార్చి 3 వతేది మధ్యాహ్నం 3:21 గంటలకు ప్రారంభమై చంద్రగ్రహణం సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది.గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3 గంటల 27 నిమిషాలు ఉంటుంది.. గ్రహణ సూతకాలం ఉదయం 6.19 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ సమయం నుంచి గ్రహణ ప్రభావం మొదలవుతుందని పండితులు చెబుతున్నారు. హైదరాబాద్ లో మాత్రం చివరి 27 నిమిషాలు మాత్రమే పాక్షికంగా కనపడుతుంది. అయినా గ్రహణ నియమాలు తప్పని సరిగా పాటాంచాలని పండితులు చెబుతున్నారు.
మార్చి 3న ఏర్పడే చంద్రగ్రహణం చాలా శక్తి వంతమైనది. గ్రహణం కేవలం 3 గంటల 27 నిమిషాలు మాత్రమే ఉన్నా... ఈ ప్రభావం 40 రోజుల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గ్రహణ నియమాలు పాటించాలి. అనుష్టానం .. జపాలు చేసే వారు కచ్చితంగా పట్టు స్నానం.. విడుపు స్నానం చేయాలి. ఆహార నియమాలు పాటించాలి.
దంపతులు సంసారిక వ్యవహారాలకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. గ్రహణం వీడిన తరువాత ఇంటిని నీటితో కచ్చితంగా శుద్ది చేసుకోవాలి. గంగా జలం కాని.. పుణ్య నదులు వాటర్ గాని చల్లాలి. ఇవన్నీ అందుబాటులో లేకపోతే.. ఇంటిని శుద్ది చేసిన తరువాత.. ఇంట్లో ప్రతిమూల పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఆ తరువాతే స్టవ్ వెలిగించాలి.
- ఇంట్లో పూజాది కార్యక్రమాలు ముగించుకొని.. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. కేతు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది.. కావున కేతువుకు..చంద్రునికి ప్రత్యేక పూజలు చేయాలి.
- కేజీం కేజీం పావు చొప్పున బియ్యం.. ఉలవలు దానం ఇవ్వాలి.
- పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి.
- ఈ నలభై రోజులు ప్రతి శనివారం నవగ్రహాల దగ్గర నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.
- పేదలకు అన్నదానం.. తెల్లని వస్త్రాలు దానం చేయాలి.
- బ్రాహ్మణులకు దక్షిణ.. తాంబూలం ఇవ్వాలి.
- బుధవారం వినాయకుడికి గరిక సమర్పించాలి
చంద్రగ్రహణం సమయంలో, రాక్షస శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని నమ్ముతారు. ఈసారి, పూర్వఫల్గుణి ( పుబ్బ) నక్షత్రంలో కింద సింహ రాశిలో గ్రహణం సంభవిస్తుంది. గ్రహణ ప్రభావం 40 రోజుల పాటు ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో కేతువు చాలా బలంగా ఉండి.. నష్టం కలుగజేసే అవకాశాలున్నాయి. అందుకే ప్రతిరోజు శివలింగానికి జలాన్ని ( నీరు) సమర్పించాలి. మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేయాలి.రోజూ దక్షిణామూర్తి స్త్రోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు.
