
- టీజీఐఐసీ వేలంలో దక్కించుకున్న ఎంఎస్ఎన్ సంస్థ
- రూ.1,357 కోట్లకు 7.67 ఎకరాల స్థలం సొంతం
హైదరాబాద్, వెలుగు:
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గంలో ఎకరా భూమి ఏకంగా రూ.177 కోట్లు పలికింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఇదే అత్యధిక రికార్డు ధర కావడం విశేషం. రాయదుర్గంలోని ప్లాట్లను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ) వేలం వేయగా.. 7.67 ఎకరాల ల్యాండ్ పార్సెల్‌ను ఎంఎస్ఎన్ రియాల్టీ అనే సంస్థ రూ.1,357 కోట్లకు దక్కించుకున్నది.
అంటే ఒక్కో ఎకరానికి రూ.177 కోట్లు పెట్టి కొనుగోలుచేసింది. వాస్తవానికి జులై 28న రాయదుర్గంలో 19.67 ఎకరాలతోపాటు ఉస్మాన్ సాగర్ ప్లాట్లను వేలం వేయాలని టీజీఐఐసీ నిర్ణయించింది. మార్కెట్ విలువను గరిష్టంగా రూ.104 కోట్లుగా పేర్కొంది. ఈ క్రమంలోనే సోమవారం
రాయదుర్గం భూములకు వేలం వేయగా, అంతకుమించి ధర పలకడం విశేషం.