
- కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌కు 1969 ఉద్యమకారుల సమితి వినతి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల స్మృతి వనం కోసం కంటోన్మెంట్లో వంద ఎకరాలు కేటాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను 1969 ఉద్యమకారుల సమితి నేతలు కోరారు. బుధవారం బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ఉద్యమకారుల సమితి జనరల్ సెక్రటరీ దుశ్చర్ల సుదర్శన్ రావు.. రాజ్‌నాథ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు ఇచ్చిన లేఖలను రాజ్‌నాథ్‌సింగ్‌కు సుదర్శన్ రావు అందజేశారు. ఈ అంశం మా పరిశీలనలో ఉందని, సెప్టెంబర్ నెలాఖరులో ఢిల్లీ వచ్చి కలవాలని రాజ్ నాథ్ సింగ్ తెలిపినట్టు సుదర్శన్ రావు వెల్లడించారు.