చెన్నై: స్పిన్ పిచ్‌లకు.. స్పిన్నర్లకు కేరాఫ్ అడ్రస్ ఇండియా. అలాంటిది స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై ప్రత్యర్ధి బౌలర్లతో కలిపి ఇండియా స్పిన్నర్లు ఒక్క వికెట్ కూడా పడగొట్టకుండా చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా ఇండియా–వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డేలో ఇరుజట్ల బౌలర్లు 198 బంతులు వేసి ఒక్క వికెట్ తీయలేకపోయారు.
ఇందులో ఇండియా స్పిన్నర్లు (జడేజా, కుల్దీప్ యాదవ్, పార్ట్‌టైమ్ బౌలర్ కేదార్ జాదవ్)ఎక్కువ బంతులు వేయగా.. విండీస్ లో ఛేజ్, హేడెన్ వాల్ష్ ప్రభావం చూపలేకపోయారు. స్పిన్నర్లు 30 కంటే ఎక్కువ ఓవర్లు వేసినా వికెట్ పడగొట్టని నాలుగో మ్యాచ్ ఇది. గతంలో జింబాంబ్వే–పాకిస్థా న్(222 బంతులు), ఆస్ట్రేలియా–వెస్టిండీస్(216), సౌతాఫ్రికా–శ్రీలంక(202) మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు.

