హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సహా 17 రాష్ట్రాల్లో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్రం చెప్పింది. ఈ నెల 23 నాటికి దేశవ్యాప్తంగా 46,124 శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్ ద్వారా విశ్లేషించగా 70 శాంపిల్స్ డెల్టా ప్లస్‌గా గుర్తించామంది. అత్యధికంగా మహారాష్ట్రలో 23, మధ్యప్రదేశ్‌లో 11, తెలంగాణలో 2, ఏపీలో 2 కేసులు నమోదయ్యాయని తెలిపింది. 46,124 శాంపిల్స్‌లో 4,172 అల్ఫా రకం వేరియంట్‌గా, 217 శాంపిల్స్ బీటా వేరియంట్‌గా, ఒక కేసు గామా వేరియంట్‌గా, 17,169 కేసులు డెల్టా వేరియంట్‌గా గుర్తించారు. లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు.
614 కేసులు.. నలుగురు మృతి
రాష్ట్రంలో మరో 614 మంది కరోనా బారిన పడ్డారు. శుక్రవారం 1,11,251 మందికి టెస్టులు చేస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో 73 మందికి, జిల్లాల్లో 541 మందికి పాజిటివ్ వచ్చిందని హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,44,330కి చేరగా, ఇందులో 6,31,389 మంది కోలుకున్నట్టుగా చూపించారు. ఇంకో 9,141 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ఇందులో 3807 మంది హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్నట్టు చూపించారు. కరోనాతో శుక్రవారం మరో నలుగురు చనిపోయారని, వీరితో కలిపి మృతుల సంఖ్య 3,800కు పెరిగిందనిచెప్పారు.
