
రాష్ట్రంలో డ్రగ్స్ రావాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని.. డ్రగ్స్ దందాలో ఎంత పెద్దవారు ఉన్న వదిలొద్దని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 19వ తేదీ మంగళవారం నగరంలోని దిల్ సుఖ్ నగర్ చైతన్యపూరి వద్ద డ్రగ్స్ రవాణా చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరో వ్యక్తి పరారయ్యాడు. నిందితుల నుంచి 5గ్రాముల MDMA డ్రగ్స్, LSD BLOTS 4, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందుతులను ఏపీ భీమవరంకు చెందిన కునపరాజు లక్ష్మీ నరసింహ రాజు, హైదరాబాద్ జిడిమెట్లకు చెందిన జలిమ్ శ్యామ్ రాయ్ లుగా గుర్తించారు. గతంలో వీరిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదైనట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.