హైదరాబాద్ లో 2 లక్షల 68 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తి... ఖైరతాబాద్, కూకట్ పల్లిలోనే అత్యధికం..

హైదరాబాద్ లో 2 లక్షల 68 వేల విగ్రహాల నిమజ్జనం పూర్తి... ఖైరతాబాద్, కూకట్ పల్లిలోనే అత్యధికం..

హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం వైభవంగా సాగింది. శనివారం ( సెప్టెంబర్ 6 ) ఉదయం ప్రారంభమైన గణేష్ శోభాయాత్ర ఆదివారం ( సెప్టెంబర్ 7 ) మధ్యాహ్నం వరకు 40 గంటల పాటు సాగింది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 2 లక్షల 68 వేల 755 విగ్రహాలకు నిమజ్జనం పూర్తయినట్లు సమాచారం. ఒకటిన్నర అడుగుల నుండి 3 అడుగుల వరకు ఉన్న 95 వేల 782 విగ్రహాలకు నిమజ్జనం పూర్తయినట్లు తెలుస్తోంది.3 అడుగుల కంటే ఎత్తున్న ఒక లక్ష 72 వేల 973 విగ్రహాల నిమజ్జనం అయినట్లు సమాచారం.ఖైరతాబాద్, కూకట్ పల్లి జోన్ లలోనే అత్యధిక విగ్రహాలు నిమజ్జనం అయినట్లు తెలుస్తోంది.

జోన్ల వారీ వివరాలు:

  • ఎల్బీ నగర్ జోన్: 37,800 విగ్రహాలు
  • చార్మినార్ జోన్: 23,453 విగ్రహాలు
  • ఖైరతాబాద్ జోన్: 63,468 విగ్రహాలు
  • శేరిలింగంపల్లి జోన్: 42,899 విగ్రహాలు
  • కూకట్‌పల్లి జోన్: 62,623 విగ్రహాలు
  • సికింద్రాబాద్ జోన్: 38,512 విగ్రహాలు
  • ఖైరతాబాద్, కూకట్‌ పల్లి జోన్లలో అత్యధిక నిమజ్జనాలు
  • హుస్సేన్ సాగర్ తో పాటు నగర వ్యాప్తంగా 20 చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ 
  • 74 ఆర్టిఫీషియల్ పాండ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు సీపీ సీవీ ఆనంద్. 

పోలీసులు రెండు రోజులు నిద్ర లేకుండా 40 గంటల బందోబస్తు చేశారని.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల  సమన్వయంతో అనుకున్న టైమ్ కంటే ముందే నిమజ్జనం పూర్తి చేశామని తెలిపారు సీపీ సీవీ ఆనంద్.  పదిరోజులుగా గణేష్ మండపం నిర్వాహకులను ఒప్పించి ఈసారి ముందుగానే వినాయకులను తీయించామని అన్నారు. అందులో భాగంగా ముందు సౌత్ జోన్ విగ్రహాలు తీయించినట్లు చెప్పారు. అక్కడ సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నందున ముందుగా నిమజ్జనం జరిపించినట్లు చెప్పారు. 

ఆ తర్వాత మిగతా ప్రాంతాల విగ్రహాలను తీయించి నిమజ్జనం చేయించామని తెలిపారు. ఈసారి విగ్రహాల ఎత్తు ఎక్కువగా ఉందని.. 40 ఫీట్ల కన్నా ఎత్తు ఉన్న విగ్రహాలు ఈసారి పెరిగాయని తెలిపారు. దీంతో శోభాయాత్ర ఆలస్యం అయినట్లు తెలిపారు. శనివారం రాత్రి శోభాయాత్రలో చిన్న చిన్న గొడవలు జరిగగా.. 5 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేసినందుకు  పోలీసులకు అభినందనలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఒక ప్రణాళిక బద్దంగా నిమజ్జన శోభాయాత్ర జరిగిందని ఈ సందర్భంగా సీపీ ఆనందర్ చెప్పారు.